RRB NTPC Exam ప్యాటర్న్ ఇలా ఉంటుంది
RRB NTPC Exam ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2025 ఎగ్జామ్ డేట్స్ త్వరలోనే రిలీజ్ అవ్వనున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC)లో రైల్వేశాఖ 11,558 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయితే ఉద్యోగం వచ్చినట్టే. RRB NTPC Exam లో ఇంటర్, డిగ్రీ పోస్టులకు పరీక్ష విధానం, సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది.
డిగ్రీతో పోలిస్తే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ పోస్టుల క్వశ్చన్ పేపర్ కాస్త ఈజీగా ఉంటుంది. బ్యాంక్, ఎస్ఎస్సీ, రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవాళ్లు ఈ ఎగ్జామ్స్ ను ఈజీగా క్రాక్ చేయొచ్చు.
ఇందులో గ్రాడ్యుయేషన్ అర్హతపై..
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్
గూడ్స్ ట్రైన్ మేనేజర్
స్టేషన్ మాస్టర్
జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్
సీనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ అర్హతపై..
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
ట్రైయిన్ క్లర్క్
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్
స్టేజ్ -1లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల టైం ఉంటుంది. అందులో జనరల్ అవేర్‌నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు ఉంటాయి.
స్టేజ్-1లో ఎలిజిబుల్ అయిన వారిని కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలకు మెరిట్ ప్రకారం స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
స్టేజ్-2లో 120 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాలు టైం ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్35 ప్రశ్నలు ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్:
అన్నీ పోస్టులకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఉంటుంది. అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్టు కూడా నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి.
అప్ డేట్స్ కోసం అఫీషియల్ వెబ్ సైట్ https://indianrailways.gov.in/ను విజిట్ చేస్తూ ఉండండి. లేదా మా వెబ్ సైట్ ను చెక్ చేస్తుండండి.